పోలీసులను ఢీకొట్టి.. మృతదేహాలను ఈడ్చుకెళ్లి

-పంజాబ్‌లో ఇద్దరు పోలీసులను చంపిన దుండగుడు టార్న్ తరాన్: తన వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించిన ఇద్దరు పోలీసులను ఓ దుండగుడు వాహనంతో ఢీకొట్టి, వారి మృతదేహాలను దాదాపు 100మీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి పంజాబ్‌లోని అమర్‌కోట్ లో చోటుచేసుకుంది. ఓ ఎస్‌యూవీ వాహనాన్ని ఆపటానికి హెడ్‌కానిస్టేబుల్ ఇంద్రజీత్ సింగ్, కానిస్టేబుల్ కుల్‌దీప్‌సింగ్ ప్రయత్నించగా, డ్రైవర్ వాహనాన్ని వారి మీదకు పోనిచ్చాడు. వారిద్దరి మృతదేహాలను దాదాపు 100మీటర్ల వరకు తన వాహనంతో ఈడ్చుకెళ్లాడు. అనంతరం వాహనాన్ని వదిలేసి పరారయ్యాడు. వాహనం కాంగ్రెస్ నేత సరాజ్‌సింగ్ సోదరుడు కరాజ్‌సింగ్‌దని పోలీసులు గుర్తించారు. కరాజ్ పలుమార్లు డ్రగ్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడని తెలిపారు.

Related Stories: