మృత్యుశిఖరాలు!

-ఎవరెస్టు అధిరోహణలో మరో ఇద్దరు భారతీయులు మృతి -మృతుల్లో ఆర్మీ జవాను.. తప్పిపోయిన మరొక పర్వతారోహకుడు ఖాట్మండు: హిమాలయ శిఖరాలను అధిరోహించడానికి వెళ్తున్న పర్వతారోహకుల మజిలీ విషాదాం తం అవుతున్నది. భారత్ కు చెందిన ఇద్దరు పర్వతారోహకులు కాంచనగంగా పర్వతాన్ని అధిరోహించే క్రమంలో బుధవారం ప్రాణాలు విడిచిన ఘటన మరువకముందే, ఎవరెస్టు శిఖరా న్ని అధిరోహించే క్రమంలో మరో ఇద్దరు భారతీయులు మృత్యుఒడికి చేరారు. ఇంకొకరు అదృశ్యమయ్యారు. చనిపోయి న వాళ్లలో ఆర్మీ జవాను కూడా ఉన్నారు. ఎవరెస్టు పైనున్న క్యాంపులో ఆర్మీ జవాను రవి థాకర్ శుక్రవారం ఉదయం చనిపోగా, మకాలు శిఖరాన్ని అధిరోహిం చి.. కిందికి వస్తుండగా గురువారం రాత్రి నారాయణ్ సింగ్ అనే మరో వ్యక్తి మరణించా డు. దీపాంకర్ ఘోష్ అనే కోల్‌కతవాసి కనిపించకుండాపోయాడు అని సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ చైర్మన్ మింగ్మా షెర్పా పేర్కొన్నారు. ప్రతికూల వాతావరణం వల్ల అస్వస్థతకు గురవ్వడం వల్లే రవి థాకర్ చనిపోయినట్టు షెర్పా తెలిపారు. కాంచనగంగ పర్వతాన్ని అధిరోహిస్తూ ప్రతికూల వాతావరణం వల్ల అస్వస్థతకు గురై కోల్‌కతాకు చెందిన ఇద్దరు పర్వతారోహకులు బిప్లబ్ బైద్య , కుంతల్ కరార్ బుధవారం మరణించడం తెలిసిందే.