పోలీస్ లాకప్‌లో మావోయిస్టు ఆత్మహత్య

మల్కాన్‌గిరి, డిసెంబర్ 28: ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లాలో ఓ మావోయిస్టు పోలీసు లాకప్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం 12 మంది మావోయిస్టులను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కోర్టుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతుండగా అందులో ఒకతను టాయిలెట్ వస్తుందని వెళ్లాడు. ఎంతకీ తిరిగిరాకపోవడంతో వెళ్లిచూడగా.. ఉరేసుకొని మరుగుదొడ్డిలో కనిపించాడని ఎస్పీ జగ్‌మోహన్ మీనా పేర్కొన్నారు. పోస్టుమార్టం చేసిన తర్వాత అతని మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ ఘటనపై డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ జరిపించాలని బంధువులు డిమాండ్ చేశారు.

Related Stories: