నాగ్‌,నానిల హీరోయిన్స్ ఫైన‌ల్‌..!

నాని, నాగ్ కాంబినేష‌న్‌లో క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ప్రాజెక్ట్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. వైజ‌యంతి మూవీస్ ప‌తాకంపై అశ్వినీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రామోజీ ఫిలింసిటీలో రెండో షెడ్యూల్ జ‌రుపుకుంటుంది. ఈ షెడ్యూల్‌లో నాని,నాగ్‌లు షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అయితే చిత్రంలో క‌థానాయిక‌లుగా ఎవ‌రిని ఎంపిక చేసార‌నే దానిపై క్లారిటీ లేక‌పోవ‌డంతో అభిమానులు ప‌లు ఆలోచ‌న‌లు చేశారు. తాజా స‌మాచారం ప్ర‌కారం నాని స‌ర‌స‌న రష్మిక మందాన, నాగార్జున స‌ర‌స‌న ఆకాంక్ష సింగ్‌ని సెల‌క్ట్ చేసిన‌ట్టు తెలుస్తుంది. సంపూర్ణేష్ బాబు కూడా చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. మెట్రో ట్రైన్‌లో షూటింగ్ జ‌రుపుకున్న తొలి చిత్రం ఇదే కాగా, ఈ మూవీ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతుంద‌ని తెలుస్తుంది. ఇందులో నాగార్జున డాన్‌గా క‌నిపిస్తే, నాని డాక్ట‌ర్ పాత్ర పోషిస్తున్నాడ‌ని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

Related Stories: