ఆ ప్రాంతానికి 5వేల పక్షులు వచ్చేశాయి..

శీతాకాలం కావడంతో వేలాది పక్షులు వాతావరణ మార్పులకు అనుగుణంగా తమకు అనువైన ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. జమ్మూ పరిధిలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న ఘరానా వెట్‌లాండ్ (చిత్తడి నేల ప్రాంతం) కన్జర్వేషన్ రిజర్వుకు 5వేల పక్షులు చేరుకున్నాయి. ఘరానా వెట్‌లాండ్ రిజర్వు పరిధిలో మక్వాల్, కుక్‌డియన్, అబ్దుల్లియన్, పార్గ్‌వాల్ చిత్తడి నేలల ప్రాంతాలున్నాయి. పక్షి ప్రేమికుల కోసం ఈ ప్రాంతాలకు సుమారు 170 రకాల జాతుల వలస పక్షులు..వీటిలో పెద్ద తల ఉండే బాతులు, గడ్వాల్ పక్షులు, సాధారణ అడవి బాతులు, ఊదా చిత్తడి కోళ్లు, భారత మూర్ కోళ్లు, తెల్లకొంగలు, ఇగ్రెట్స్, గ్రీన్ షాంక్స్ వంటి పక్షులు శీతాకాల సీజన్‌లో ఇక్కడికి చేరుకున్నాయని జమ్మూ వన్యసంరక్షణ విభాగం అధికారి షాజాద్ చౌదరి తెలిపారు.

Related Stories: