వేర్వేరు సంఘటనలో రైలు ఢీకొని ఇద్దరు మృతి...

కాచిగూడ : పట్టాల పక్కన నడుచుకుంటూ వెలుతుండగా రైలు ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే ఇన్‌స్పెక్టర్ ఎం.రమేశ్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఆనంతపురం జిల్లా, గుత్తి, బాసినేపల్లి ప్రాంతానికి చెందిన బాబాయ్య కుమారుడు తోట భరత్‌కుమార్ (25)ఎంటెక్ వరకు చదివాడు. కొత్తపేటలో ఉంటూ ఉద్యోగం కోసం అన్వేశిస్తున్నాడు. కాచిగూడ-విద్యానగర్ రైల్వేస్టేషన్‌ల మధ్య పట్టాల పక్కన నడుచుకుంటూ వెలుతుండగా అదే సమయంలో ఎదురుగా వచ్చిన ఎంఎంటిఎస్ రైలు ఢీకొనడంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న హెడ్‌కానిస్టేబుల్ నిరంజన్‌నాయక్ సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహన్ని ఉస్మానియా దవాఖాన మార్చురిలో భద్రపరిచారు. కేసును కాచిగూడ రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో సంఘటనలో..... పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ వృద్దుడు మృతి చెందాడు. రైల్వే ఇన్‌స్పెక్టర్ ఎం.రమేశ్ కథనం ప్రకారం ఉప్పుగూడ నరహరినగర్ ప్రాంతానికి చెందిన సోమయ్య కుమారుడు టి.ఆగమయ్య(62)విశ్రాంత జీహెచ్‌ఎంసీ ఉద్యోగి. ఉప్పుగూడ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతుండగా అదే సమయంలో ఎదురుగా వచ్చిన రైలు ఢీకొనడంతో ఆ వృద్దుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న హెడ్‌కానిస్టేబుల్ నిరంజన్‌నాయక్ సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహన్ని ఉస్మానియా దవాఖాన మార్చురిలో భద్రపరిచారు. కేసును కాచిగూడ రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Stories: