ఆర్టీసీ బస్సు బీభత్సం: ఇద్దరు మృతి

మేడ్చల్: జిల్లాలోని మేడిపల్లి మండలం నారపల్లి వద్ద దారుణ సంఘటన చోటు చేసుకుంది. డివైడర్ దాటి అవతలి వైపు వాహనాలపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు ఢీకొట్టడంతో ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇద్దరు దంపతులు తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృతి చెందారు. మరో రెండు వాహనాలపై ప్రయాణిస్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు కోటేశ్వరరావు(29), స్వప్న(27)గా గుర్తించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బస్సు డ్రైవర్ సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

Related Stories: