ఇద్దరు ముత్తూట్ దొంగలను నగరానికి తరలించిన పోలీసులు

హైదరాబాద్: పటాన్‌చెరు రాంచంద్రపూర్‌లో ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌లో దోపిడికి పాల్పడిన ఇద్దరు నిందితులను ఇవాళ పోలీసులు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. వీరిలో ప్రధాన నిందితుడు లక్ష్మన్ సింగ్ ఉన్నారు. లక్ష్మన్ సింగ్ దోపిడికి పాల్పడిన ప్రతీసారి వేశాలు మార్చినట్టు పోలీసులు గుర్తించారు. దేశవ్యాప్తంగా 6 ముత్తూట్ ఫైనాన్స్‌లలో దోపిడి చేసినట్టు తెలిపారు. లక్ష్మన్ సింగ్ 16 దోపిడి కేసుల్లో నిందితుడిగా ఉన్నట్టు గుర్తించారు. ముంబై మాఫియాతో సంబంధాలున్నట్టు భావిస్తున్నారు.
× RELATED ఐదు ఫ్లాపుల త‌ర్వాత విజ‌యం రుచి చూసిన అందాల భామ‌