ఓరుగల్లులో వైభవంగా శ్రీయాగం

-హాజరైన చినజీయర్‌స్వామి వరంగల్: వరంగల్ నగరంలోని శ్రీవేంకటేశ్వరగార్డెన్స్‌లో శ్రీయాగం వైభవోపేతంగా కొనసాగుతోంది. త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్‌స్వామి ప్రత్యేక పర్యవేక్షణలో విశ్వశాంతి కోసం శ్రీయాగాన్ని నిర్వహిస్తున్నారు. వరంగల్‌లో గీతా ప్రచారక పరిషత్ స్థాపించి 60 వసంతాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్నయాగంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శనివారం ప్రారంభమైన యాగంలో భాగంగా రెండో రోజు ఆదివారం చతుస్థానార్చన, మూలమంత్రది హావనం, నక్షత్రేష్టిహవనం, పారాయణములు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి భక్తులనుద్దేశించి అనుగ్రహబాషణం చేశారు. సోమవారం యాగం పూర్తవుతుందని నిర్వాహకులు తెలిపారు.

Related Stories: