జలనేతి పాత్ర వల్ల ఆమెకు ప్రాణగండం వచ్చింది

కొండనాలుకకు మందు వేస్తే అనే సామెతను మార్చిచెప్పుకోవాలేమో. అమెరికాలోని సియాటిల్ నగరానికి చెందిన ఓ మహిళ మెదడుకు జబ్బుసోకి మరణించింది. బాలముతియా మాండ్రిలాస్ అనే మెదడును తినివేసే అరుదైన బ్యాక్టీరియా వల్ల ఆమె ప్రాణాలు కోల్పోయింది. 1986లో ఈ బ్యాక్టీరియాను గుర్తించిన తర్వాత ఇప్పటిదాకా కేవలలం 200 కేసులు మాత్రమే బయటకువచ్చాయి. అందులో సియాటిల్ మహిళ కూడా ఉంది. మరైతే ఆమె మెదడులోకి ఆ బ్యాక్టీరియా ఎలా ప్రవేశించింది? అంటే యోగాలో భాగంగా ఆమె ఉపయోగించిన జలనేతి పాత్ర అందుకు కారణం అయ్యుంటుందని వైద్యులు నిర్ధారించారు. జలనేతి పాత్ర గొట్టాన్ని ముక్కులోని ఒక రంధ్రంలో పెట్టుకుని నీళ్లు పోస్తూ మరో రంధ్రంలో నుంచి బయటకు తీస్తారు. ఆమె కూడా అదే చేసేది. ఆ పాత్ర ద్వారానే అరుదైన బ్యాక్టీరియా ఆమె ముక్కులోకి ప్రవేశించిందని, అక్కడి నుంచి సునాయాసంగా మెదడుకు చేరిందని అంటున్నారు. ఎందుకంటే ముక్కులో మెదడు దిగవ నాడీకణాలు సులభంగా అందుబాటులో ఉంటాయి. అంటే సైనస్ సమస్యలకు ఆమె చేసిన జలనేతి ప్రక్రియ ప్రాణాలకే ఎసరు తెచ్చిందన్నమాట. ఇప్పుడు జలనేతి పాత్రలపై అమెరికా వైద్యవర్గాల్లో చర్చ జరుగుతున్నది.

Related Stories: