డబ్ల్యూటీవోకు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే వివిధ దేశాలపై వాణిజ్య యుద్ధం ప్రకటించిన ఆయన.. తాజాగా ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో)కూ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా పట్ల డబ్ల్యూటీవో అనైతికంగా వ్యవహరిస్తోందన్నారు. ఒకవేళ డబ్ల్యూటీవో తన రూల్స్‌ను మార్చకపోతే, అప్పుడు మేం ఆ సంస్థ నుంచి ఉపసంహరించుకుంటామని ట్రంప్ తెలిపారు. బ్లూమ్‌బర్గ్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. వివిధ దేశాల మధ్య వాణిజ్యం, వాణిజ్య సమస్యలను పరిష్కరించుకునేందుకు డబ్ల్యూటీవోను ఏర్పాటు చేశారు. అయితే డబ్ల్యూటీవోలో కేసులను పరిష్కరించేందుకు ఏర్పాటైన కోర్టు కోసం ఇద్దరు జడ్జిలను నియమించాల్సి ఉంది. కానీ ఆ జడ్జిల నియామకాన్ని అమెరికా నిలువరిస్తున్నదన్న ఆరోపణలు వస్తున్నాయి.
× RELATED యోగా టీచర్ కావాలనుకునే వారికి సువర్ణావకాశం..