భారత్ మాతో వాణిజ్యం కోరుకుంటోంది : ట్రంప్

వాషింగ్టన్ : వాణిజ్యపరంగా అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా.. ఆ దేశంతోనే భారత్ స్నేహం కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. భారత్ తమతో వాణిజ్యాన్ని కొనసాగించాలని ఆశిస్తున్నట్లు తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఆర్థికంగా ఎదుగుతున్న ఇండియా, చైనా లాంటి దేశాలకు సబ్సిడీలు నిలిపివేయాలని కొన్ని రోజుల క్రితం ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. అయినా తమతో వాణిజ్యం ఒప్పందం కుదుర్చుకునేందుకు భారత్ ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు ట్రంప్ తాజాగా వెల్లడించారు. రెండు రోజుల క్రితం ఇండియా నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని, ఆ దేశం తమతో ట్రేడ్ డీల్ చేయాలనుకుంటుందని ట్రంప్ తెలిపారు. అయితే భారత్ నుంచి ఎవ‌రు ట్రంప్‌తో మాట్లాడారన్న అంశం స్పష్టంగా తెలియదు. చైనా, ఇండియాలకు సబ్సిడీలు నిలిపేస్తామన్న ట్రంప్.. అమెరికా ఉత్పత్తులపై భారత్ వంద శాతం పన్ను విధించడాన్ని ఆయన తప్పుపట్టారు. జపాన్ కూడా అమెరికాతో వాణిజ్యం ఒప్పందం కుదుర్చుకోవాలని ఆశిస్తున్నది. ప్రధాని మోదీ, ప్రధాని షింజో అబేలతో తనకు మంచి స్నేహం ఏర్పడిందని ట్రంప్ ఇటీవల ఓ సందర్భంలో అన్నారు.
× RELATED ఇంట్లోనుంచి బయటికి రాలేని పరిస్థితి : ప్రియా వారియర్