అముల్ థాపర్‌ను ఇంటర్వ్యూ చేసిన ట్రంప్

వాషింగ్టన్: భారత సంతతి న్యాయమూర్తి అముల్ థాపర్‌ను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇంటర్వ్యూ చేశారు. అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆంధోనీ కెన్నడీ ఈ నెల 31వ తేదీన రిటైర్ కానున్నారు. ఆయన స్థానంలో కొత్త జడ్జిని నియమించనున్నారు. దీని కోసం మొత్తం నలుగుర్ని షార్ట్‌లిస్ట్ చేశారు. అందులో అముల్ థాపర్ ఒకరు. మొత్తం 25 మంది నుంచి నలుగుర్ని ఆ పోస్ట్ కోసం షార్ట్‌లిస్ట్ చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియామకం కోసం ఇంటర్వ్యూ చేసిన వారిలో అముల్ థాపర్‌తో పాటు బ్రెట్ కవగాన్, ఆమీ కోనే, బారెట్, రేమండ్ కీథ్‌లెడ్జ్ ఉన్నారు. జూలై 9వ తేదీన కొత్త న్యాయమూర్తి పేరును ప్రకటించనున్నట్లు వైట్‌హైజ్‌లో ట్రంప్ తెలిపారు. ఎంపిక ప్రక్రియ చాలా ఆసక్తికరంగా సాగుతున్నట్లు కూడా ఆయన చెప్పారు. అన్ని అంశాల్లో సమగ్రమైన అవగాహన ఉన్న వ్యక్తిని ఎంపిక చేసేందుకు ట్రంప్ ఉత్సుకత చూపిస్తున్నట్లు వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ తెలిపారు.
× RELATED యువకుడి దారుణహత్య.. ప్రేమవ్యవహారం బయటపెట్టడమే కారణమా?