ట్రంప్‌ను కార్టూన్‌తో కొడుతున్న కమేడియన్ కేరీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటే అమెరికా మేధావి వర్గానికి చిరాకు. ఆయన విధానాల పట్ల మొదటినుంచీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. అందులో హాలివుడ్ ముందువరుసలో ఉంది. మాస్క్, డంబ్ డంబర్ వంటి సినిమాలతో కమేడియన్‌గా విశిష్టస్థానాన్ని సంపాదించుకున్న జిమ్ కేరీ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మెక్సికో సరిహద్దుల్లో పట్టుబడే శరణార్థుల్లో తల్లిపిల్లలను వేరుచేయడం వంటి ట్రంప్ విధానాలపై అమెరికాలో ఎప్పటికప్పుడు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నది. ఇలంటివి నచ్చని సినిమాస్టార్స్ మహాఅయితే ఓ ప్రకటన ఇచ్చి వదిలేస్తారు. కానీ కేరీ అలాకాదు. కార్టూన్లు గీస్తాడు. 2016 నుంచి ఇప్పటివరకు గీసిన కార్టూను గీయకుండా తన అమెచూర్ కుంచెకు పని చెప్తూనే ఉన్నాడు.

ఊరికే గీసి వదిలేయకుండా వాటిని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేస్తూ ఉంటాడు. జిమ్ కేరీ ట్విట్టర్ ఖాతాకు కోటీ 80 లక్షల మంది ఫాలోవర్లు ఉండడం గమనార్హం. ఇటీవలే కార్టూన్లలో సెంచరీ కూడా కొట్టాడు. అందులో ఒక దాంట్లో ట్రంప్‌ను క్రీస్తుకు సిలువ వేస్తున్న రోమన్ సైనికుడిలా చూపితే మరోదాంట్లో స్వేచ్ఛకు ప్రతీకలాంటి లిబర్టీ విగ్రహానికి క్యాన్సర్ సోకినట్టు చూపాడు. తాజాగా న్యూయార్కర్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇవి నా అర్జున ఘడియలు అంటూ భగవద్గీతను గుర్తుచేశాడు. ఆయుధం ధరించక తప్పదు అన్నాడు. ఆయుధం అంటే మరేమీ కాదు.. తన కుంచె!

× RELATED 3వేల యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైళ్ల కొనుగోలు..