ఎంపీ కవితకు కృతజ్ఞతలు తెలిపిన టీఆర్వీకేఎస్ నేతలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం నేతలు నిజామాబాద్ ఎంపీ, టీఆర్వీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ను కలిసి కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు. ఈ సందర్భంగా కార్డ్ బోర్డ్ పై ఎంపీ కవిత ఫోటో ను ముద్రించిన ఫోటో ఫ్రేమ్ ను ఆమెకు బహూకరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ నెల 1వ తేదీన విద్యుత్ ఉద్యోగులకు 35 శాతం ఫిట్మెంట్, వెయిటీజ్, అలవెన్సులు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ దీనికి సంబంధించి ట్రాన్స్ కో ఆర్డర్ కూడా ఇప్పించినందుకు ఎంపీ కవితకు టీఆర్వీకేఎస్ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. అందరి ఇళ్లలో వెలుగులు చిమ్మే విద్యుత్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీఆర్వీకేఎస్ రుణపడి ఉంటుందన్నారు. ప్రతి క్షణం విద్యుత్ ఉద్యోగ, కార్మికుల సంక్షేమమే తమ ధ్యేయమన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో తామంతా తప్పకుండా పాలు పంచుకుంటామని ఈసందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, టీఆర్వీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు కేవీ జాన్సన్, ప్రధాన కార్యదర్శి కె.ప్రకాష్, మేడే రాజీవ్ సాగర్, దాస్యం విజయ భాస్కర్, సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిహెచ్ రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.మునీందర్, డోలి శ్రీను, అదనపు ప్రధాన కార్యదర్శి దుర్గ అశోక్, కోశాధికారి మోహన్ రెడ్డి, ఎస్పీడీసీఎల్ డిస్కం అధ్యక్షులు బి.భాస్కర్, కరణ్ రావు, వి.రాములు, కేపీ కృష్ణమోహన్, ఎస్.రామకృష్ణ, వి.సునీల్, ఎం.ఏ మోహన్ పాల్గొన్నారు.

Related Stories: