ఫ‌లితాల విష‌యంలో ఆందోళ‌న చెంద‌వ‌ద్దు: కేటీఆర్‌

హైద‌రాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల విషయంలో చోటుచేసుకున్న అపోహలపై విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఇవాళ‌ సమీక్షించార‌ని టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఫ‌లితాల విష‌యానికి సంబంధించి కేటీఆర్ ట్విట‌ర్‌లో స్పందించారు. అపోహలను తొలగించడానికి ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. సత్వరమే దర్యాప్తు జరిపి మూడు రోజులలో ఈ కమిటీ నివేదికను సమర్పిస్తుంది. ఫలితాల విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు. ఫలితాల విషయంలో పొరపాట్లు జరిగినట్లు భావిస్తే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ లకు వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఏ ఒక్క విద్యార్ధికి కూడా నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేటీఆర్ పేర్కొన్నారు.
More in తాజా వార్తలు :