ఎన్నికల ప్రచారానికి ఎన్‌ఆర్‌ఐలు సిద్ధం..!

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న అసెంబ్లీ రద్దు నిర్ణయానికి తెలంగాణ వాసులందరూ సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నారు. విదేశాల్లో ఉన్న తెలంగాణ వాసులందరూ రానున్న ఎన్నికల్లో పాల్గొనేలా దేశ విదేశాల్లో ప్రచారం నిర్వహించడానికి టీఆర్‌ఎస్ ఎన్నారై శాఖ రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా టీఆర్‌ఎస్ న్యూజిలాండ్ శాఖ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ న్యూజిలాండ్ అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ... నిన్నటి ప్రకటన ప్రతిపక్షాలకు ఒక మాస్టర్ స్ట్రోక్ లాంటిదన్నారు. తెలంగాణ ప్రగతి కేవలం సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమని, గడిచిన నాలుగేళ్లలో చేపట్టిన సంక్షేమ పథకాలు దీనికి ఉదాహారణ అన్ని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో 100కు పైగా స్థానాల్లో విజయదుంధుబి మోగిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
× RELATED బాలిక కిడ్నాప్..24 గంటల్లోనే కాపాడారు