కావాలనే టీఆర్‌ఎస్‌పై దుష్ప్రచారం : ఎంపీ కవిత

నిజామాబాద్ : ఓట్ల గల్లంతు విషయంలో కాంగ్రెస్ కావాలనే టీఆర్‌ఎస్‌పై దుష్ప్రచారం చేస్తుందని నిజామాబాద్ ఎంపీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల వ్యవహారం ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వస్తుందన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గమనించాలని ఆమె సూచించారు. మహాకూటమి దుష్ట చతుష్టయం అని కవిత పేర్కొన్నారు. తెలంగాణ మీద ప్రేమ లేని పార్టీలు మహాకూటమిగా వస్తున్నాయన్నారు. 60 ఏళ్లుగా లేని అభివృద్ధిని సీఎం కేసీఆర్ నాలుగేళ్లలో చేసి చూపించారు. పెండింగ్‌లో ఉన్న రైల్వే పనులు, అండర్ గ్రౌండ్ పనులు పూర్తయ్యాయి. అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్ర ప్రజలను ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు పీక్కుతిన్నాయని కవిత నిప్పులు చెరిగారు.

Related Stories: