ప్రగతి నివేదన సభకు నిజామాబాద్ సమాయత్తం

నిజామాబాద్ : టీఆర్‌ఎస్ పార్టీ సెప్టెంబర్ 2న కొంగరకలాన్‌లో నిర్వహించబోయే ప్రగతి నివేదన సభకు నిజామాబాద్ జిల్లా ప్రజలు సమాయత్తం అవుతున్నారని ఆ పార్టీ ఎంపీ కవిత స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎంపీ కవిత మీడియాతో మాట్లాడారు. దేశంలోనే అత్యున్నత సభగా ప్రగతి నివేదన సభ నిలుస్తుందన్నారు. ఈ నాలుగు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని సీఎం కేసీఆర్ వివరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ పెద్ద ఎత్తున ప్రగతి నివేదన సభకు తరలి రావడానికి ఉత్సాహం చూపుతున్నారని తెలిపారు. ఈ సభకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. దేశంలో ఇప్పటి వరకు ఇలాంటి సభ జరగలేదని ఆమె చెప్పారు. ప్రగతి నివేదన సభ నేపథ్యంలో పార్టీలోని ప్రతి కార్యకర్తను సమన్వయం చేస్తూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఈ నాలుగేళ్లలో ఎన్నో అడ్డంకులను అధిగమించి.. తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేశామన్నారు. తెలంగాణ సంక్షేమ పథకాలను పలువురు ఆదర్శంగా తీసుకుంటున్నారని ఎంపీ కవిత స్పష్టం చేశారు.
× RELATED కుప్పకూలిన కివీస్.. భారత్ టార్గెట్ 158