అన్నీ చ‌ర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం..

న్యూఢిల్లీ: రేప‌టి నుంచి శీతాకాల పార్ల‌మెంట్ స‌మావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇవాళ అఖిల‌ప‌క్ష స‌మావేశం జ‌రిగింది. అన్ని స‌మ‌స్య‌ల‌ను చ‌ర్చించేందుకు త‌మ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. ప్ర‌తిప‌క్షాలు లేవ‌నెత్తే ప్ర‌తి అంశాన్ని చ‌ర్చిస్తామ‌ని, శీతాకాల స‌మావేశాలు నిర్మాణాత్మ‌కంగా ఉంటాయ‌ని ఆశిస్తున్న‌ట్లు, అన్ని పార్టీల నుంచి మ‌ద్ద‌తు ఉంటుంద‌ని భావిస్తున్నాన‌ని మోదీ అన్నారు. కావాలంటే, ముఖ్య‌మైన బిల్లుల‌ను పాస్ చేసేందుకు స‌మావేశాల‌ను సాయంత్రం వ‌ర‌కు నిర్వ‌హిస్తామ‌ని అన్నారు. ప్ర‌ధాని హామీ ఇచ్చినా.. ప్ర‌తిప‌క్షాలు మాత్రం రాఫెల్ అంశంపై వ‌త్తిడి చేయాల‌నుకుంటున్నాయి. సంయుక్త పార్ల‌మెంట‌రీ క‌మిటీతో విచార‌ణ చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించాయి. ఆర్బీఐ, సీబీఐ అంశాల గురించి కూడా ప్ర‌తిప‌క్షాలు స‌భ‌లో లేవ‌నెత్త‌నున్నాయి. 58 వేల కోట్ల కుంభ‌కోణం జ‌రిగిన రాఫెల్ అంశంపై జేపీపీ వేయాల‌ని వ‌త్తిడి తేనున్న‌ట్లు ప్ర‌తిప‌క్ష నేత గులామ్ న‌బీ ఆజాద్ అన్నారు.

Related Stories: