గులాబీ జోరు.. ప్రచార హోరు

-ముమ్మరంగా అభ్యర్థుల ప్రచారాలు.. గ్రామాల్లో కొనసాగుతున్న మద్దతులు -నామినేషన్ కోసం విరాళాలు ఇస్తూ కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్న ప్రజలు -టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటామంటూ సమావేశాలు
నమస్తే తెలంగాణ, నెట్‌వర్క్: నాలుగున్నరేండ్ల టీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి, వచ్చే ఎన్నికల్లో తమను గెలిపించాలని గులాబీ అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ప్రజలు సైతం తమ సంపూర్ణ మద్దతు ప్రకటించి, భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని వెల్లడిస్తున్నారు. నామినేషన్ల ఖర్చు కోసం విరాళాలు సేకరించి ఇస్తూ కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం కుంటలొంపుతండా, మోతీఘనపూర్‌తోపాటు రాజాపూర్ మండల కేంద్రంలో జరిగిన పలు కార్యక్రమాల్లో మంత్రి సీ లకా్ష్మరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం లో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి త్వరలో జరుగనున్న ఎన్నికల్లో తమను ఆదరించి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏండ్ల తరబడి ప్రజా సమస్యలను పట్టించుకోని నాయకులు ఎన్నికల నాటికి ఇం టింటికీ వచ్చి మాయమాటలతో మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. అలాంటి వారిని గుర్తించి బుద్ధి చెప్పాలని ప్రజలకు సూచించారు. టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని తమను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశా రు. ఈ సందర్భంగా రాజాపూర్‌కు చెందిన పాల్కొండ వెంకటయ్య, కురుగుల రాములు ఎన్నికల ప్రచార ఖర్చు కోసం మంత్రికి రూ. రెండు వేలను అందజేశారు.

కాంగ్రెస్, టీడీపీ పొత్తు సిగ్గుచేటు: ఎంపీ సీతారాంనాయక్

వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేటలో మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీలు పొత్తు పెట్టుకుని బరిలోకి దిగడం సిగ్గుచేటని విమర్శించారు. ఎన్ని పొత్తులు పెట్టుకున్నా, ఎంతమంది పొత్తుకూడినా టీఆర్‌ఎస్ అభ్యర్థులు 100 స్థానా ల్లో గెలువడం, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. నర్సంపేట అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డిని భారీ మె జార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట నియోజకవర్గంలోని మరికల్ మండలంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి రాజేందర్‌రెడ్డికి మద్దతు గా భారీ మోటర్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. రాజేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని నినాదాలు చేశారు. మక్తల్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పలు గ్రామాల్లో పర్యటించి ప్రచారం చేశారు. దేవరకద్ర నియోజకవర్గంలో ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రచారం నిర్వహించా రు. గ్రామస్థులతో సమావేశాలు నిర్వహించి వచ్చే ఎన్నికల్లో అండగా ఉంటే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని స్పష్టంచేశారు. మహబూబ్‌నగర్ పట్టణంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికల ప్రచారాన్ని ని ర్వహించారు. మహిళా సంఘాలతో సమావేశాలు నిర్వహించి ఎన్నికల్లో మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

గొంగడి కప్పుకుని.. గొర్రెపిల్లను సంకనేసుకుని..

కరీంనగర్ జిల్లా మానకొండూరు అభ్యర్థి రసమయి బాలకిషన్ తిమ్మాపూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామస్థులను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగా రు. ఈ సందర్భంగా యాదవసంఘం నాయకులు రసమయికి గొంగడికప్పి, గొర్రె పిల్లను బహూకరించారు. మహిళలు నుదుట తిలకందిద్ది ఆహ్వానించారు. గౌడన్నలు మో కు, కల్లుకుండ చేతికి అందించారు. మార్గమధ్యంలో రా ట్నం వడికి ఆకట్టుకున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వడ్డెమాన్‌లో ప్రచారం చేపట్టిన టీఆర్‌ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డికి మహిళలు హారతులు పట్టా రు. ఈ సందర్భంగా మర్రి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి రేఖానాయక్ సిరికొండ మండలం రాంపూర్‌గూడ, రాంపూర్(బీ), ఇం ద్రవెల్లి మండలం దనోరా (బీ) గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావడం తథ్యమని టె స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామం లో టీఆర్‌ఎస్ శ్రేణులు నిర్వహించిన జెండా పండుగలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో మార్నింగ్ వాక్‌లో భాగంగా పిడమర్తి రవి ప్రచారం చేశా రు. తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయిన టీడీపీకి చెందిన వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి వెలగబెట్టేదేమీలేదని, మా టలతో కాలం వెళ్లదీస్తున్న సండ్రను ఈసారి ఓడించేందు కు కలిసి రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ డోర్, వాల్‌పోస్టర్లు తయారుచేయించి విస్తృత ప్రచారం చేస్తున్నారు.

టీఆర్‌ఎస్‌కు ఓకే..

టీఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్దతులు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మున్నూరుకాపు సంఘ సభ్యులు మంత్రి కేటీఆర్‌కు మద్దతు ప్రకటించారు. తెలంగాణలోని అన్నివర్గాల ప్రజల సంక్షేమం కో సం నిరంతరం పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, దేశ ప్రజలను సిరిసిల్ల నియోజకవర్గంవైపు చూసేలా అభివృద్ధి చేస్తున్న మంత్రి కేటీఆర్‌కు వచ్చే ఎన్నికల్లో తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. మున్నూరుకాపు మహిళాసంఘం సభ్యులు సైతం సమిష్టిగా మంత్రి కేటీఆర్‌కు మద్దతుప్రకటించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అభ్యర్థి మంత్రి ఈటల రాజేందర్‌కే తాము ఓటు వేస్తామంటూ ఇల్లందకుంట మండలం సిరిసేడులోని 15 కుల సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తమ గ్రామంలో మంత్రి ఈటల రూ.4 కోట్ల 80లక్షలతో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని, అందుకోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. మ హబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం కుంటలొంపుతండాలో కారుగుర్తుకే ఓటు వేస్తామని, మంత్రి లకా్ష్మరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని వెల్లడించా రు. వర్ధన్నపేట అభ్యర్థి అరూరి రమేశ్‌ను గెలిపించుకుంటామని వరంగల్ అర్బన్ జిల్లా చింతగట్టు గ్రామానికి చెం దిన గీత కార్మికులు వెల్లడించారు. జనగామ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ప్రజలు విశేష మద్దతు పలుకుతున్నారు. వడ్లకొండ, నర్మెట్ట, తరిగొప్పుల మండలాలకు చెందిన కుమ్మరులు టీఆర్‌ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి సంపూర్ణ మద్దతు తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్ అభ్యర్థి తాటికొండ రాజయ్యకు రఘునాథపల్లి మండలం మల్లంపల్లి గ్రామస్థులు సంఘీభావం ప్రకటించారు. భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని స్పష్టంచేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు నర్సింహులపల్లి గ్రామస్థులు, నల్లలింగయ్యపల్లి బీడీ కార్మికులు మద్దతు ప్రకటించారు.

ప్రచారం కోసం బాజిరెడ్డికి రూ.లక్ష విరాళం

డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ: నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌పై డిచ్‌పల్లి మండల ఎంపీటీసీలు అభిమానాన్ని చాటుకున్నారు. ఆదివారం మండలానికి చెందిన 20 మంది ఎంపీటీసీలు రూ. లక్ష చెక్కును బాజిరెడ్డికి అందజేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రచారానికి వినియోగించాలని కోరారు. బాజిరెడ్డి చెక్కు తీసుకునేందుకు నిరాకరించగా.. తాము అభిమానంతో ఇస్తున్నామని, కాదనవద్దని ఒత్తిడి తేవడంతో అంగీకరించారు. చెక్కును అందజేసిన వారిలో టీఆర్‌ఎస్ నాయకులు దాసరి లక్ష్మీనర్సయ్య, ఒడ్డెం నర్సయ్య, మోహన్, ఎంపీటీసీలు ఉన్నారు.

టీఆర్‌ఎస్ గెలుపు కోసం మహిళల పాదయాత్ర

నకిరేకల్: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ, నకిరేకల్‌లో పార్టీ అభ్యర్థి వేముల వీరేశం గెలుపు కోరు తూ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం నకిరేకల్ నుంచి చెర్వుగట్టు వరకు 80 మంది మహిళలు పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్ర ను నకిరేకల్‌లో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పూజర్ల శంభయ్య జెండాఊపి ప్రారంభించారు. నకిరేకల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి వేముల వీరేశం సతీమణి వేముల పుష్ప ఆధ్వర్యం లో నకిరేకల్, కట్టంగూరు, నార్కట్‌పల్లి మీదుగా చెర్వుగట్టు వరకు 30 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మహిళల కోసం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కునుకు సుహాసిని, పందిరి యాదమ్మ, అనసూర్యమ్మ, గంగాధరి పద్మ, పార్టీ పట్టణ అధ్యక్షుడు కొండ వెంకన్న, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వీర్లపాటి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

విద్యాసాగర్‌కు అండగా..

మల్లాపూర్: జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుకు మల్లాపూర్ మండలంలోని గొర్రెపల్లి గ్రామస్థులు అండగా నిలిచారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం గ్రామానికి వచ్చిన విద్యాసాగర్‌రావుకు గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ) ఆధ్వర్యంలో నామినేషన్ ఖర్చుల కింద రూ. 10,116లు అందజేశారు. తాము ఇచ్చిన నగదుతోనే ఎమ్మెల్యేగా నామినేషన్ వేయాలని గ్రామస్థులు కోరారు. అనంతరం మాజీ సర్పంచ్ కదుర్క నర్సయ్య నేతృత్వంలో గ్రామస్థులంతా టీఆర్‌ఎస్‌కే ఓటు వేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌రావు గ్రామస్థుల అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. గెలిచినా, ఓడినా గొర్రెపల్లి గ్రామాన్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటానని, గ్రామాభివృద్ధికి ఎల్లవేళలా సహకరిస్తానని తెలిపారు.

సంగారెడ్డి అభ్యర్థికి మద్దతుగా..

సదాశివపేట: సంగారెడ్డి అభ్యర్థి చింతా ప్రభాకర్‌కు ముస్లింలు మద్దతు ప్రకటించారు. నామినేషన్ ఖర్చుల కోసం నగదు అందజేశారు. ఆదివారం సదాశివపేటలోని అస్రా ఫంక్షన్‌హాలులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యేగా చింతా ప్రభాకర్‌ను గెలిపించుకుంటామని స్వచ్ఛందంగా వెల్లడించారు. నామినేషన్ ఖర్చుల నిమిత్తం సేకరించిన రూ. 21 వేలను అందజేశారు. తనకు మద్దతుగా నిలిచి, నామినేషన్ కోసం నగదును అందజేసిన ముస్లింలకు చింతా ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు.