15న టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో కమిటీ భేటీ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో కమిటీ తొలి సమావేశం ఈ నెల 15న జరుగనున్నది. టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అధ్యక్షతన 15 మంది సభ్యులతో ఏర్పాటైన ఈ కమిటీ తెలంగాణభవన్‌లో సమావేశం కానున్నది. రాబోయే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చే హామీలు, తమ ప్రభుత్వం చేపట్టబోయే భవిష్యత్ ప్రణాళికలను ఇందులో చేర్చే అవకాశం ఉన్నది. అన్ని వర్గాల ప్రజల సమస్యలను, బంగారు తెలంగాణ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మ్యానిఫెస్టోలో వివరించనున్నారు. సీఎం కేసీఆర్ సూచనలకు అనుగుణంగా మ్యానిఫెస్టోను ఖరారుచేయనున్నారు.