జగ్గారెడ్డి దేశ ద్రోహి : పద్మా దేవేందర్‌రెడ్డి

హైదరాబాద్ : మానవ అక్రమ రవాణా కేసులో అరెస్టు అయిన జగ్గారెడ్డిపై టీఆర్‌ఎస్ నాయకురాలు పద్మాదేవేందర్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. హ్యుమన్ ట్రాఫికింగ్ కేసులో జగ్గారెడ్డి అరెస్టు అయితే కాంగ్రెస్ పార్టీ సిగ్గు పడాల్సింది పోయి బంద్‌లు చేయడమేంటి? అని ఆమె ప్రశ్నించారు. బంద్ పాటించడానికి.. జగ్గారెడ్డి ఏమైనా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నాడా? అని అడిగారు. కాంగ్రెస్ హయాంలోనే జగ్గారెడ్డిపై మానవ అక్రమ రవాణా కేసు నమోదైందని పద్మాదేవేందర్‌రెడ్డి గుర్తు చేశారు. దేశ ద్రోహి అయిన జగ్గారెడ్డికి కాంగ్రెస్ మద్దతివ్వడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. జగ్గారెడ్డి ఆయన భార్య, పిల్లలను కూడా మోసం చేశాడు. నేరస్థులకు కొమ్ము కాయడమే కాంగ్రెస్ నైజమా? అని పద్మాదేవేందర్ రెడ్డి నిలదీశారు.

Related Stories: