ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థులు

హైదరాబాద్ : టీఆర్ఎస్ అభ్యర్థులు పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. వాడవాడకూ, ఇంటింటికీ తిరుగుతూ తమకు మద్దతివ్వాలని, టీఆర్ఎస్ కు ఓటు వేయాలని కోరుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో దేవరకద్ర ఎమ్మెల్యే అభ్యర్థి ఆల వెంకటేశ్వర్ రెడ్డి, కొడంగల్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరారు.

ఆల వెంటేశ్వర్ రెడ్డి స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. అనంతరం వాడవాడకు తిరుగుతూ తనకు ఓటు వేయాలని కోరారు. కొడంగల్ అభ్యర్థి ఎంపీ జితేందర్ రెడ్డితో కలిసి స్థానిక దర్గాలో ప్రార్థనలు చేశారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

× RELATED న‌య‌న‌తార బ‌ర్త్‌డే గిఫ్ట్‌గా సైరా మోష‌న్ పోస్ట‌ర్