కువైట్‌లో టీఆర్‌ఎస్ కాల్ క్యాంపెయిన్ ప్రారంభం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కేసీఆర్ ప్రభుత్వానికి మద్దతుగా నిలువడంతోపాటు పార్టీని గెలిపించాలనే లక్ష్యంతో టీఆర్‌ఎస్ ఎన్నారై విభాగం కువైట్ కాల్ క్యాంపెయిన్ ప్రారంభించింది. టీఆర్‌ఎస్ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల, కువైట్ టీఆర్‌ఎస్ ప్రతినిధి గొడిశాల అభిలాష బుధవారం కువైట్‌లో అవంతి ప్యాలెస్‌లో కాల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఎన్నారై ప్రతినిధులు అబ్దుల్ అజీజ్, కొండల్‌రెడ్డి, సురేశ్‌గౌడ్, గిరీశ్, జీ దివ్య, ప్రమోద్, జమీల్, సూదగాని రవి, శ్రీనాథ్, రమేశ్, గంగారపు రవి, ముజాయిద్, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.