ట్రిపుల్ తలాక్‌.. రాజ్యసభలో బ్రేక్

న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఈసారి కూడా మోక్షం దక్కలేదు. ఈ బిల్లును చర్చించడం లేదంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తెలిపారు. బిల్లుపై ఏకాభిప్రాయం కుదరలేదని ఆయన అన్నారు. దీంతో ఈ బిల్లు వచ్చే శీతాకాల సమావేశాల్లో మళ్లీ సభ ముందకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముస్లిం సాంప్రదాయం ప్రకారం.. మూడు సార్లు తలాక్ అంటే విడాకులు ఇచ్చినట్లే. అయితే ట్రిపుల్ తలాక్ బిల్లు ద్వారా తలాక్ చెప్పే సంస్కృతికి చెక్ పెట్టాలని కేంద్రం భావిస్తున్నది. ట్రిపుల్ తలాక్ చట్టాన్ని చేసేందుకు కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్‌ను జారీ చేసే అవకాశం ఉన్నది. ట్రిపుల్ తలాక్ చట్టంలో మార్పులు చేయాలంటూ చివరినిమిషంలో క్యాబినెట్ నిర్ణయించింది. రెండు వివాదాస్పద ప్రతిపాదనలను మార్చాలని భావిస్తున్నారు. గత ఏడాదే ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం దక్కింది. అయితే రాజ్యసభలో ఎన్డీఏ మైనార్టీలో ఉన్న కారణంగా.. అక్కడ ఆ బిల్లుకు ఆమోదం దక్కలేదు.

Related Stories: