కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘననివాళి

ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషా, జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్, మావల సర్పంచ్ ఉష్కం రఘుపతి పాల్గొన్నారు. ఆసిఫాబాద్‌లోని తన నివాసంలో కొండా లక్ష్మణ్ బాపూ జీ చిత్రపటానికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పోరాడారని కొనియాడారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో పుట్టి జాతీయస్థాయిలో గుర్తింపు పొందారని గుర్తుచేశారు.

Related Stories: