టీఆర్‌ఈఐఆర్బీ లెక్చరర్ దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఈఐఆర్బీ (తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు) ప్రకటించిన జూనియర్ లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగించినట్టు బోర్డు కన్వీనర్ నవీన్ నికోలస్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ నెల15తో ముగుస్తుండగా, తమకు వచ్చిన అభ్యర్థనల మేరకు గడువు పొడిగించినట్టు తెలిపారు.