ఎస్సీ నిరుద్యోగ యువతకూ పలు కోర్సుల్లో శిక్షణ

హైదరాబాద్ : జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ యువతకు కేల్ట్రాన్ (కేరళ స్టేట్ ఎలక్ట్రానిక్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) సంస్థ ద్వారా వివిధ కోర్సులలో శిక్షణ పొందుటకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్డ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వెబ్ డిజైనింగ్ డెవలప్‌మెంట్ (మూడు నెలల పాటు), వర్డ్ ప్రాసెసింగ్ డాటా ఎంట్రీ ఆఫీసర్ (3 నెలలు), లాజిస్టిక్ అండ్ ట్రాన్స్‌పోర్టు మేనేజ్‌మెంట్ (3 నెలలు), సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజ్‌మెంట్ (3 నెలలు), ఎంఎస్ ఆఫీస్, బేసిక్ ఆటోమేషిన్, షోరూమ్ అండ్ రిటైల్ సేల్స్, బేసిక్ అకౌటింగ్ కాన్సెప్ట్ అండ్ టాలీ కోర్సులలో శిక్షణ పొందే అభ్యర్ధులకూ చక్కటి హాస్టల్ వసతి కల్పించినట్లు తెలిపారు. వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలని, దరఖాస్తుతో పాటు ఆదాయం, కులం, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను జతచేసి ఎస్సీ కార్యాలమం (కలెక్టరేట్ కాంప్లెక్స్) నందు సమర్పించాలని సూచించారు. శిక్షణ పూర్తయిన అభ్యర్థులకూ ఉద్యోగావకాశాలు కల్పించబడతాయని, ఈ దరఖాస్తు సమర్పణకు వచ్చే నెల 8 గడువు విధించినట్లు అధికారులు తెలిపారు.

Related Stories: