ఇంజిన్ రహిత రైలు ట్రైయిల్ రన్ విజయవంతం

మొరాదాబాద్ : పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఇంజిన్ రహిత రైలు(ట్రైన్-18)ను ఆదివారం ప్రయోగాత్మకంగా పరీక్షించారు. మొరాదాబాద్-రాంపూర్ మధ్య ఈ రైలు పరుగులు పెట్టింది. ఈ సందర్భంగా వివిధ స్థాయిల్లో రైలు వేగాన్ని అధికారులు పరీక్షించారు. ఇదే సమయంలో రైలు బ్రేకులను కూడా పరీక్షించారు. ఈ రైలును మొదట మొరాదాబాద్-బరేలి మధ్య పరీక్షించాలని అధికారులు నిర్ణయించినప్పటికీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో మొరాదాబాద్-రాంపూర్ మధ్య పరీక్షించారు. అధికారులు మాట్లాడుతూ మూడు దశల్లో రైలు వేగాన్ని పరీక్షించామని(గంటకు 30, 50, 60 కి.మీ. వేగంతో ప్రయాణించడం) చెప్పారు. తమ పరీక్ష(ట్రైయిల్ రన్) విజయవంతమైందని, వాస్తవానికి ఈ రైలు గంటకు 220 కి.మీ. వేగంతో ప్రయాణించగలదని తెలిపారు. 16 బోగీలతో ఉండే ఈ రైలులో దివ్వాంగులకు ప్రత్యేక మరుగుదొడ్లు, చిన్న పిల్లలకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే డ్రైవర్ బోగీకి రెండు వైపుల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామని, ప్రయాణికుల కదలికలను తెలుసుకోవడంతోపాటు ప్రమాదాలను నివారించడానికి ఈ కెమెరాలు ఉపయోగపడుతాయని వివరించారు.

Related Stories: