లారెల్-హార్డీపై హాలివుడ్ బయోపిక్.. స్టాన్ అండ్ ఓలీ

సినిమా ప్రపంచంలో ప్రస్తుతం బయోపిక్‌ల హవా నడుస్తున్నది. తాజాగా హాలివుడ్ అలనాటి సుప్రసిద్ధ హాస్యనటద్వయం లారెల్, హార్డీలపై హాలివుడ్ సినిమా తయారైంది. స్టాన్ అండ్ ఓలీ అని దీనికి టైటిల్ పెట్టారు. బుధవారం ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. లారెల్-హార్డీ సినిమాలు కొన్ని తరాలపాటు అలాఅలా అలరిస్తూనే ఉన్నాయి. వారి హాస్యనటన హాలీవుడ్ సినిమాలకు ఓ మైలురాయిలా నిలిచిపోయింది. బక్కపలచగా ఉండి వెంగళప్పలా కనిపించే స్టాన్ లారెల్, లావుగా ఉండి గంభీరంగా ఉండేందుకు తంటాలు పడే ఆలివర్ హార్డీ జంట ప్రపంచ ప్రసిద్ధి పొందింది. వారు నటించినవి ఎక్కువగా మూకీలే. టాకీల కాలంలోనూ కొన్ని సినిమాల్లో నటించారు. వందలాది లఘుచిత్రాలు, పిడికెడు పూర్తినిడివి చిత్రాల్లో ఈ హాస్యజంట నవ్వులు పండించింది. అవి ఇప్పటికీ జనాదరణ పొందుతూనే ఉన్నాయి. ఇద్దరి జంటహాస్యం పాతబడుతున్న కొద్దీ వారి మధ్య పొరపొచ్చాలు రావడం, దూరాలు పెరగడం ఈ సినిమా ప్రధాన కథాంశం. చిత్రంలో స్టాన్ లారెల్‌గా స్టీవ్ కూగన్, ఆలివర్ హార్డీగా జాన్ సీ రైలీ 2019 జనవరి 11న స్టాన్ అండ్ ఓలీ విడుదల కాబోతున్నది.

Related Stories: