బీ అలర్ట్.. మ. 2 నుంచి 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ : ఇవాళ విద్యుత్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన పీఆర్సీ ప్రకటించనున్నారు. ఈ క్రమంలో ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ట్రాన్స్‌కో, జెన్‌కో ఉద్యోగులు సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రిని కలిసి ఆయన నోటి వెంట శుభవార్తను విని కృతజ్ఞతలు తెలిపేందుకు విద్యుత్ సంస్థలకు చెందిన వేల మంది ఉద్యోగులు ప్రగతి భవన్‌కు తరలివెళ్లనున్నారు. దీంతో ప్రగతి భవన్ చుట్టుపక్కల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. బేగంపేట ైఫ్లె ఓవర్, గ్రీన్‌ల్యాండ్స్, డీకే రోడ్, మాతా టెంపుల్(అమీర్‌పేట్), మోనప్ప జంక్షన్(సోమాజిగూడ సర్కిల్), సోమాజిగూడ రోడ్, వీవీ స్టాచ్యూ జంక్షన్, నిమ్స్ రోడ్, నాగార్జున సర్కిల్, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1, 2 రూట్లలో వాహనదారులు వెళ్లాల్సి ఉంటుంది.

Related Stories: