హయత్‌నగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం

హైదరాబాద్: నగరంలోని హయత్‌నగర్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జాం అయింది. కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. భాగ్యలత నగర్ - ఆటోనగర్ మధ్య వినాయక విగ్రహాల విక్రయాలు జరుగుతున్నాయి. వినాయక విగ్రహాలు కొనుగోలు చేసేందుకు యువకులు తరలివచ్చారు. క్రేన్‌ల సహాయంతో పెద్దపెద్ద విగ్రహాలను వాహనాల్లో ఎక్కించే క్రమంలో ట్రాఫిక్ జాం అయింది. విజయవాడ జాతీయరహదారిపై ఆటోనగర్ నుంచి హయత్‌నగర్ వరకు ట్రాఫిక్ స్థంభించిపోయింది.