రేపు నగరంలో ట్రాఫిక్ అంక్షలు..

హైదరాబాద్ : మిలాద్ ఉన్ నబి సందర్భంగా రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని 8 ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలో అంక్షలను విధించారు. రద్దీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్ళిస్తారు లేదా నిలిపివేస్తారు.ఈ అంక్షలను దృష్టిలో పెట్టుకుని వాహనదారులు, సామాన్య ప్రజలు ప్రత్యమ్నాయ మార్గాలను ఎంచుకుని ప్రయాణీంచాలని సీపీ మహేష్ భగవత్ విజ్ఞప్తి చేశారు. మిలాద్ ఉన్ నబి సందర్భంగా ర్యాలీలు, వివిధ కార్యక్రమాలు జరగునున్న ప్రాంతాలు... ఎల్బీనగర్ ట్రాఫిక్ పీఎస్-సరూర్‌నగర్ ట్యాంక్ ఇద్గా, ఎల్బీనగర్ మజీద్ గల్లీ, దుర్గామాతా టెంపుల్ గల్లీ, ఎన్టీఆర్ నగర్ మార్కెట్ మజీద్. వనస్థలిపురం ట్రాఫిక్ పీఎస్-పహాడిషరీఫ్ మార్కాజ్ దర్గా నదీమ్ హోటల్ ఎదురుగా, మార్కాజ్ దర్గా ఉస్పానా మందిర్, సాదత్‌నగగర్, నందనవనం కాలనీ, సాహేబ్‌నగర్ జామా మజీద్, బడి మజీద్, హాయత్‌నగర్. మల్కాజిగిరి ట్రాఫిక్ పీఎస్-మౌలాలీ కమాన్ మాస్క్, ఎస్పీనగర్ మాస్క్, మల్కాజిగిరి మాస్క్, సాకేత్ సాయిబాబానగర్ ఈద్గా. కుషాయిగూడ ట్రాఫిక్ పీఎస్-ఘట్‌కేసర్ మాస్క్ ఉప్పల్ ట్రాఫిక్ పీఎస్-నాచారం ఎక్స్ రోడ్డు, హెచ్‌ఎమ్‌టీ కమాన్, ఏక్ మినార్, ఎస్‌హెచ్‌కె ఆసుపత్రి, టోయోట షో రూమ్, రామాంతాపూర్. యాదాద్రి ట్రాఫిక్ పీఎస్-యాదిగిరిగుట్ట మజీద్. భువనగిరి ట్రాఫిక్ పీఎస్-జలీల్‌పురా మజీద్ చౌటుప్పల్ ట్రాఫిక్ పీఎస్-చౌటుప్పల్ బస్సు స్టాప్ దర్గా, చిన్న కొండూర్ రోడ్డు మజీద్, బంగారు గడ్డ మజీద్, వీవీఆర్ ఫంక్షన్ హాల్ మజీద్, గురుకులం ఈద్గా. ప్రజలకు ఏదైనా అత్యవసర సేవలు అవసరమైనప్పుడు డయల్ 100కు సమాచారం ఇవ్వొచ్చని సీపీ తెలిపారు.

Related Stories: