డాన్స్ చేస్తూ ట్రాఫిక్‌ను ఆపుతూ.. వీడియో

ఈ ట్రాఫిక్ పోలీస్ డాన్స్ బేబీ డాన్స్ షోను రోడ్డు మీదనే పెట్టాడు. డాన్స్ చేస్తూ ట్రాఫిక్‌ను మేనేజ్ చేస్తూ వార్తల్లోకెక్కాడు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఈ డాన్స్ ట్రాఫిక్ పోలీస్ విధులు నిర్వర్తిస్తున్నాడు. పేరు ప్రతాప్ చంద్ర ఖండ్వాల్. ఇదివరకు హోంగార్డ్‌గా చేసేవాడట. ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్‌ను చేశారట. అయితే.. ట్రాఫిక్ పోలీస్‌గా పనిచేయడం కొత్త కావడంతో మనోడి ఆజ్ఞను వాహనదారులెవరూ పట్టించుకోలేదట. దీంతో చిరాకు చెందిన ఖండ్వాల్.. వాహనదారుల అటెన్షన్ కోసం రోడ్డు మీదే డాన్స్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో వాహనదారులు మనోడి డాన్స్‌కు ఫిదా అయిపోయి వాహనాలను ఆపుతున్నారట. అలా ట్రాఫిక్ కంట్రోల్ అవుతుండటంతో ఇక డాన్స్‌తోనే ట్రాఫిక్‌ను ఆపడం ప్రారంభించాడట. దీంతో మనోడు అక్కడ తెగ ఫేమస్ అయిపోయాడు. ఇక.. మనోడు డాన్స్ చేస్తూ ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తుండగా ఓ వాహనదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇదివరకు కూడా ఇలాగే ఓ ట్రాఫిక్ పోలీస్ డాన్స్ చేస్తూ ట్రాఫిక్ ను కంట్రోల్ చేసి వార్తల్లోకెక్కాడు.
× RELATED ఛత్తీస్‌గఢ్‌లో రేపు రెండో విడత పోలింగ్