కాళేశ్వరంలో ప్రముఖులు..

జయశంకర్ భూపాలపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వర దేవస్థానాన్ని ఇవాళ ప్రముఖులు సందర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషి సతీసమేతంగా, ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ మిశ్రా, ఆయన సతీమణి ఐఏఎస్ శాలినిమిశ్రా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాగా, వీరిరువురు ముందుగా కాళేశ్వరంలోని హరిత హోటల్‌కు రాగా, జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి దేవస్థానానికి వచ్చిన వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి సన్నిధిలో పూజలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కల్యాణ మండపంలో అర్చకులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ చైర్మన్ వెంకటేశం స్వామి వారి శేష వస్ర్తాలతో సన్మానించారు. ఇక్కడ కాళేశ్వరం సీఈ వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు స్వామివారి చిత్రపటం అందజేశారు. ఇక్కడ నుంచి నేరుగా కన్నెపల్లి పంపుహౌస్‌ను సందర్శించగా అక్కడ సీఈ వెంకటేశ్వర్లు మ్యాప్ ద్వారా పంప్‌హౌస్ విశిష్టతను వివరించారు. అనంతరం అన్నారం బ్యారేజీకి వెళ్లగా అక్కడ అధికారులు ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతుల గురించి వివరించారు. ప్రాజెక్టు పూర్తి కావడానికి ఇంకా పట్టే సమయం, ఇతర సాంకేతిక పనుల గురించి అడిగి తెలుసుకున్నారు.

Related Stories: