ఆంధ్రాలో మావోయిస్టుల అలజడి

హైదరాబాద్ : ఆంధ్రాలో మావోయిస్టుల అలజడి కలకలం రేపుతోంది. విశాఖ - తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దులోని సీలేరు వద్ద మావోయిస్టుల క్యాంపుపై ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్స్ దళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల నుంచి మావోయిస్టు అగ్రనేత చలపతితో పాటు మరో 100 మంది మావోయిస్టులు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య 48 నిమిషాల పాటు ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఘటనాస్థలిలో మూడు తుపాకులు, ఆరు కిట్ బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ కొనసాగిస్తున్నారు.

Related Stories: