పోష‌కాల గ‌ని.. పాల‌కూర‌..!

పాలకూరలో ఎన్నో పోషకాలుంటాయి. ఇది చర్మాన్ని సంర‌క్షిస్తుంది. మన శ‌రీరానికి ప‌నికొచ్చే అనేక పోష‌కాలు పాల‌కూర‌లో ఉంటాయి. పాల‌కూర‌ను త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. పాల‌కూర వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పాలకూర తినడం వల్ల కంటిచూపు మెరుగవుతుంది. వయసు వల్ల వచ్చే మాక్యులర్‌ డీజనరేషన్‌ తలెత్తకుండా నిరోధిస్తుంది. రక్తపోటు సాధారణస్థాయిలో ఉండేలా చూస్తుంది. ఆస్టియోపొరాసిస్‌, గుండెజబ్బులు రాకుండా కాపాడుతుంది.

2. జీవక్రియను పెంపొందిస్తుంది. జీర్ణవ్యవస్థ బాగా పనిచేసేలా తోడ్పడుతుంది. ఇందులోని విటమిన్‌-కె హిమోఫీలియా చికిత్సకు సహాయపడుతుంది. రక్తస్రావాన్ని ఆపే గుణం పాలకూరలో ఉంది. పాలకూరలోని విటమిన్‌-కె వల్ల కాల్షియం ఉత్పత్తి అయి ఎముకలు పటిష్టంగా ఉంటాయి. శుక్లాల రిస్కును తగ్గిస్తుంది. గాస్ట్రిక్‌ అల్సర్లను నివారిస్తుంది.

3. కడుపులోని శిశువు ఆరోగ్యంగా పెరిగేలా, నాడీ వ్యవస్థ బలంగా ఉండేలా సహాయపడుతుంది. ఎసిడిటీని తగ్గిస్తుంది. క్యాన్సర్‌ బారిన పడకుండా నిరోధిస్తుంది. అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడంతోపాటు దీర్ఘకాలంలో చర్మ కాన్సర్‌ బారిన పడకుండా కాపాడుతుంది.

4. మొటిమ‌ల‌ సమస్యను నివారిస్తుంది. చర్మ సౌంద‌ర్యం పెరుగుతుంది. కళ్ల కింద ఏర్పడ్డ నల్లటి వలయాలు పోతాయి. యాంటి-ఏజింగ్‌ గుణాలు పాలకూరలో బాగా ఉన్నాయి. పాలకూరలో ఫ్యాట్‌, క్యాలరీలు తక్కువ. అందుకే దీన్ని తినడం వల్ల బరువు తగ్గుతాం. ఇందులో కొవ్వును కరిగించే డైటరీ ఫైబ‌ర్ ఉంటుంది.

5. డైట‌రీ ఫైబ‌ర్ వల్ల మలబద్దకం సమస్య పోవడంతోపాటు అతిగా తినడం తగ్గుతుంది. శరీరం ఒత్తిడికి లోనుకాకుండా ఉంటుంది. వృద్ధులలో మెద‌డు ఆరోగ్యంగా పనిచేసేలా సహాయపడుతుంది. వయసు పైబడిన వారు రోజూ పాలకూర తినడం వల్ల యంగ్‌గా, యాక్టివ్‌గా ఉంటారు. పాలకూర తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది.

Related Stories: