ఉదయాన్నే ఓట్ మీల్‌తో ఆరోగ్యం..!

మనకు అందుబాటులో ఉన్న అన్ని రకాల తృణ ధాన్యాల్లో ఓట్స్ చాలా ఆరోగ్యకరమైనవని అందరికీ తెలిసిందే. మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన విటమన్లు ఓట్స్‌లలో ఉంటాయి. అంతేకాకుండా మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఓట్స్‌లో పుష్కలంగా ఉంటాయి. ఇవి అధిక బరువును తగ్గించుకునేందుకు ఎంతగానో సహాయ పడతాయి. మధుమేహం అదుపులో ఉండేలా చేస్తాయి. గుండె జబ్బులు రాకుండా చూస్తాయి.

రోజూ ఉదయాన్నే ఓట్‌మీల్‌ను బ్రేక్‌ఫాస్ట్‌లా తీసుకుంటే అనేక లాభాలు కలుగుతాయి. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు ఓట్‌మీల్‌ను ఉదయాన్నే తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ అమాంతం పెరగవు. కంట్రోల్‌లో ఉంటాయి. దీంతో మధుమేహాన్ని అదుపు చేయవచ్చు. అలాగే అధిక బరువు తగ్గేందుకు ఓట్స్ సహాయం చేస్తాయి. వీటిల్లో ఉండే ఫైబర్ జీర్ణం అయ్యేందుకు సమయం పడుతుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి బాగా వేయదు. ఫలితంగా ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గాలనుకునే వారికి మేలు చేస్తుంది. అలాగే ఉదయాన్నే ఓట్‌మీల్ తినడం వల్ల మలబద్దకం కూడా దూరమవుతుంది. ఓట్స్‌లో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను నయం చేస్తుంది. ఓట్స్‌లో మెగ్నిషియం పుష్కలంగా ఉంటుంది. అందువల్ల శరీరం ఎంజైమ్‌లను చక్కగా వినియోగించుకుంటుంది. శక్తి సరిగ్గా అందుతుంది. హైబీపీ తగ్గుతుంది.

Related Stories: