నిర్మాత ఆదిత్యరామ్‌కు మాతృ వియోగం

ఆదిత్యరామ్ స్టూడియోస్ పతాకంపై సందడే సందడి, ఖుషీ ఖుషీగా, స్వాగతం, ఏక్‌నిరంజన్ వంటి చిత్రాల్ని నిర్మించిన నిర్మాత ఆదిత్యరామ్ మాతృమూర్తి పి.లక్ష్మి కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు సాయంత్రం చెన్నైలోని ఆదిత్యరామ్ నగర్‌లో జరిగాయి.