ప్రైవేట్ పార్టీలో చిరు, రాజ‌శేఖ‌ర్‌, మోహ‌న్ బాబు

సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో మెగా స్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా ఇటీవ‌ల తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఫిబ్ర‌వరిలో రెండో షెడ్యూల్ మొద‌లు కానుంద‌ని తెలుస్తుంది. మొన్న‌టి వ‌ర‌కు పొడుగు మీసం, భారీ గ‌డ్డంతో కనిపించిన చిరు ఇప్పుడు నార్మ‌ల్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు. రెండో షెడ్యూల్‌కి కాస్త టైం దొర‌క‌డంతో దాదాపు అన్నీ ఈవెంట్స్, పార్టీస్ క‌వర్ చేస్తున్నాడు చిరు. రీసెంట్‌గా మెగాస్టార్ ఓ ప్రైవేట్ పార్టీలో మెరిసారు. మోహ‌న్ బాబు, సుబ్బి రామి రెడ్డి, అశ్వినీద‌త్‌, నాగ బాబు తో పాటు రాజ‌శేఖ‌ర్ ఫ్యామిలీ అంతా పార్టీలో క‌నిపించారు. అయితే గ‌రుడ వేగ చిత్రం మంచి విజ‌యం సాధించిన సంద‌ర్భంగా రాజ‌శేఖ‌ర్ ఫ్యామిలీ ఇలా కొంద‌రితో క‌లిసి స‌ర‌దా పార్టీ సెల‌బ్రేట్ చేసుకుందా అనే అనుమానాలు అభిమానుల‌లో త‌లెత్తుతున్నాయి. ఏదేమైన చాలా రోజుల తర్వాత రాజ‌శేఖ‌ర్‌, చిరు ఇంత అన్యోన్య‌యంగా క‌నిపించ‌డం ఇరు అభిమానుల‌లో ఎంతో ఆనందాన్ని క‌లిగిస్తుంది.

Related Stories: