వ్యాపార రుణాలపై నేడు ఉచిత సదస్సు

హైదరాబాద్ : బేగంపేట మోతీలాల్ నెహ్రూనగర్‌లోని భారతీయ యువశక్తి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు గురువారం వ్యాపార రుణాలపై ఉచిత అవగాహన సదస్సును నిర్వహించనున్నట్టు ట్రస్ట్ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. వ్యాపారం ఎలా నిర్వహించాలి ? ఏ విధంగా రుణాలు పొందాలి? వాటిని ఎలా అభివృద్ధి చేయాలి ? తదితర అంశాలపై ఉచిత సలహాలు సూచనలు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.వివరాలకు 9618453891, 040 2776 5774 లో సంప్రదించాలని తెలిపారు.

Related Stories: