జుట్టు సమస్యలను తీర్చే చిట్కాలు..

జుట్టు రాలడం, పొడిబారడం, చిట్లడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారా..?కింది చిట్కాలతో వాటికి చెక్ పెట్టేయండి.

* గుడ్డులోని తెల్లసొన, కలబంద గుజ్జు వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని బ్రష్‌తో జుట్టు మొత్తానికి పట్టించాలి. 50 నిమిషాల తరువాత సాధారణ నీటితో తలస్నానం చేయాలి. తర్వాత కండీషనర్ అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టురాలడం తగ్గుతుంది. * మెంతులను బాగా నానబెట్టి పేస్టులా చేయాలి. అందులో కొంచెం హెన్నాపొడి, గుడ్డు తెల్లసొన వేసి బాగా కలిపి మిశ్రమంలా తయారుచేయాలి. ఈ పేస్టును కుదుళ్ల నుంచి మొత్తం జుట్టుకు పట్టించాలి. రెండు గంటల తరువాత నీటితో తలస్నానం చేయాలి. తరుచూ ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. * గుడ్డు తెల్లసొన, అరటిగుజ్జు, ఆలివ్ ఆయిల్ వేసి మిశ్రమంలా చేయాలి. ఈ పేస్టును జుట్టుకు పట్టించాలి. 20 నిమిషాల తరువాత సాధారణ నీటితో తలస్నానం చేయాలి. వారానికి మూడుసార్లు ఇలా చేయడం వల్ల జుట్టు పొడిబారడం తగ్గుతుంది.

Related Stories: