మళ్లీ మొదటికొచ్చిన కూటమి సీట్ల పంచాయతీ

హైదరాబాద్: మహా కూటమి సీట్ల పంచాయతీ మళ్లీ మొదటికొచ్చింది. టీడీపీ ప్రకటించిన మహబూబ్‌నగర్ స్థానంలోనూ పోటీ చేస్తామంటూ టీజేఎస్ ప్రకటించింది. సొంతంగా 12 సీట్లకు టీజేఎస్ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించిన స్థానాలకూ టీజేఎస్ అభ్యర్థులను నిలుపుతున్నది. స్టేషన్ ఘన్‌పూర్‌లో ఇందిర, ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కు పేర్లను కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. తాము పోటీ చేసే మరో మూడు స్థానాలను కూడా ప్రకటించనున్నట్లు టీజేఎస్ తెలిపింది. జనగామ సీటు కూడా తమదే అంటూ ఇప్పుడు కొత్త పేచీ ప్రారంభించింది. మొదట 8 సీట్లకు ఓకే అని.. ఇప్పుడు 12 స్థానాల్లో పోటీ చేస్తామంటూ టీజేఎస్ వెల్లడించింది.

Related Stories: