కాళేశ్వరం గోదావరిలో ముగ్గురు గల్లంతు

మహారాష్ట్రకు చెందిన యువకులుగా గుర్తింపు కాళేశ్వరం: జయంశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం గోదావరిలో మహారాష్ట్రకు చెందిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి... కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలోని కొంబర్ల మండలం చింతలదాబ గ్రామానికి చెందిన పది మంది యువకులు కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చారు. గోదావరిలో స్నానలు చేసే క్రమంలో ప్రమాదవశాత్తు ప్రవాహంలో పడి కొట్టుక పోయినట్లు తోటి మిత్రులు తెలిపారు. అనిల్ కోడిమెతె (28), మహేంద్ర పోరెతె (23), రోహంత్ కడిమెతె (21) గల్లంతయిన వారిలో ఉన్నారు. సమచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గజ ఈత వాళ్లతో గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం వరకు ఎలాంటి అచూకి లభించలేదు. దీంతో అనుమానం వచ్చి అక్కడే ఉన్న మరో ఏడుగురిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారణ చేపడుతున్నారు. అందులో అనిల్ వరోరాలో పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మరో ఇద్దరు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నట్లు తెలిపారు. గురువారం ఉదయం మరో సారి గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు ఎస్సై తెలిపారు. గల్లంతయిన యువకులు కుటుంబ సభ్యులు గురువారం ఉదయం వరకు వచ్చే ఆవకాశాలు ఉన్నాయి. వారు వచ్చిన తర్వాత విచారణ చేపట్టనున్నారు.

Related Stories: