ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి

ఒడిశా: రాష్ట్రంలోని ఏవోబీలో అర్థరాత్రి మావోయిస్టులకు - పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కోరాపుట్ జిల్లా నారాయణపట్నం మండలం తొల్లగోమండి గ్రామం డొక్రిజాట్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో భారీగా మందుగుండు సామాగ్రి, మావోయిస్టు పార్టీ సాహిత్యం, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతంలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Related Stories: