మూడు చ‌ర్చిలు.. మూడు హోట‌ళ్లు.. ఆరు చోట్ల పేలుళ్లు

హైద‌రాబాద్ : శ్రీలంక ర‌క్త‌సిక్త‌మైంది. దేశంలో ఇవాళ ఆరు చోట్ల పేలుళ్లు చోటుచేసుకున్నాయి. మూడు హోట‌ళ్లు, మూడు చ‌ర్చిల‌ను దుండ‌గులు టార్గెట్ చేశారు. కోట‌హెనాలో సెయింట్ అంథోనీస్ కొచ్చిగేడ్ చ‌ర్చిలో మొద‌టి పేలుడు జ‌రిగింది. అక్క‌డ 160 మంది గాయ‌ప‌డ్డారు. బాలికోలాలోని జియాన్ చ‌ర్చిలో జ‌రిగిన పేలుళ్ల‌లో 300 మంది గాయ‌ప‌డ్డారు. ఉద‌యం 8.45 నిమిషాల‌కు సెయింట్ సెబాస్టియ‌న్ చ‌ర్చిలో జ‌రిగిన పేలుడులో 50 మంది మృతిచెందారు. చ‌ర్చిల‌తో పాటు కొలంబోలోని కింగ్స్‌బ‌రీ, షాంగ్రీలా, సిన‌మోన్ గ్రాండ్ హోట‌ల్స్ వ‌ద్ద కూడా పేలుళ్లు జ‌రిగాయి. కొలంబోలో జ‌రిగిన పేలుళ్ల‌లో విదేశీయులు, స్థానికులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వారిని కొలంబో జ‌న‌ర‌ల్ హాస్ప‌ట‌ల్లో చేర్పించారు. ఇవాళ శ్రీలంకలో జ‌రిగిన వ‌రుస పేలుళ్లో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 138 మంది చ‌నిపోయారు.
More in అంతర్జాతీయం :