ఇలా అయితే ఎయిడ్స్ కేసులు పెరుగుతాయ్!

న్యూఢిల్లీ: సెక్షన్ 377ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి అసంతృప్తి వ్యక్తంచేశారు. అయితే ఇదే తుది తీర్పు కాదని, దీనిని సవాలు చేసే వీలుందని ఆయన అన్నారు. ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును కొట్టేసే అవకాశం కూడా ఉన్నట్లు స్వామి చెప్పారు. స్వలింగ సంపర్కం నేరం కాదు అన్న తీర్పు వల్ల లైంగిక వ్యాధులు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. స్వలింగ సంపర్కాన్ని ఓ జన్యుపరమైన రుగ్మతగా ఆయన అభివర్ణించారు. హెచ్‌ఐవీ కేసులు, గే బార్లు పెరిగిపోతాయి.. దీనిని ప్రత్యామ్నాయ లైంగిక తీరుగా పరిగణించలేమని స్వామి స్పష్టంచేశారు. చాన్నాళ్లుగా స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్న సెక్షన్ 377ను సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే.

Related Stories: