అదృష్టం అంటే ఈ ప్లేయర్‌దే.. వరుసగా మూడు ఐపీఎల్ టైటిల్స్!

ముంబై: ఐపీఎల్ టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ మూడోసారి గెలిచింది. అయితే ఓ ప్లేయర్ మాత్రం వరుసగా మూడు ఐపీఎల్ టైటిల్స్ గెలిచాడు. ఆ ప్లేయర్ పేరు కరణ్ శర్మ. అతని అదృష్టమేంటోగానీ.. గత రెండు సీజన్లలో టైటిల్స్ గెలిచిన టీమ్స్‌లోనే కరణ్ శర్మ ఉన్నాడు. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో, 2017లో ముంబై ఇండియన్స్ టీమ్‌లో ఉన్న అతడు.. ఈసారి చెన్నై సూపర్‌కింగ్స్‌తో పాటు ట్రోఫీ అందుకున్నాడు. అతను మూడు టీమ్స్‌కు ఆడిన హెల్మెట్స్‌తో ఓ ట్వీట్ కూడా చేశాడు.

అయితే ఈ ఏడాది చెన్నై టీమ్‌లో ఉన్నాడుగానీ.. సీనియర్ హర్భజన్ ఉండటంతో అతనికి ఎక్కువగా తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. ధోనీ సలహా మేరకు లెగ్ స్పిన్నర్ అయిన కరణ్‌ను టీమ్‌లోకి తీసుకున్నామని కోచ్ ఫ్లెమింగ్ చెప్పాడు. అయితే ఫైనల్లో హైదరాబాద్ కెప్టెన్ విలియమ్సన్ వికెట్ తీసి విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లాడిన అతడు 4 వికెట్లు తీశాడు.

× RELATED యోగా టీచర్ కావాలనుకునే వారికి సువర్ణావకాశం..