టీమిండియాతో గ్రూప్ ఫొటో.. అనుష్క ఏం చెప్పిందంటే..

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఇండియన్ టీమ్‌తో కలిసి గ్రూప్ ఫొటో దిగడంపై ఎన్ని విమర్శలు వచ్చాయో తెలిసిందే. అనుష్క ఏమైనా టీమ్ వైస్‌కెప్టెనా అంటూ అభిమానులు ట్రోల్ చేశారు. లండన్‌లోని ఇండియన్ హై కమిషన్‌కు టీమ్ వెళ్లిన సమయంలో ఈ ఫొటో దిగారు. అయితే దీనిపై అనుష్క శర్మ స్పందించింది. తన లేటెస్ట్ మూవీ సుయ్ ధాగా మూవీ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అనుష్క.. ఆ గ్రూఫ్ ఫొటోపై మాట్లాడింది. దీనిపై ఇప్పటికే వివరణ ఇవ్వాల్సిన వాళ్లు ఇచ్చారు. అదంతా ట్రోలింగ్. ఇలాంటి ట్రోల్స్‌పై నేను స్పందించను. వాటిని పెద్దగా పట్టించుకోను. జరిగిందేదో జరిగిపోయింది. అన్ని నిబంధనల ప్రకారమే జరిగాయి. ఇంత చిన్న విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అనుష్క శర్మ స్పష్టంచేసింది. టీమిండియాతో కలిసి అనుష్క శర్మ దిగిన ఫొటో వైరల్ అయింది. ఆ ఫొటోలో కెప్టెన్, తన భర్త అయిన విరాట్ పక్కనే అనుష్క నిలబడింది. వైస్‌కెప్టెన్ అజింక్య రహానే మాత్రం ఎక్కడో మూలన నిల్చున్నాడు. అధికారిక కార్యక్రమాల్లో అనుష్క ఏ హోదాలో పాల్గొన్నదంటూ చాలా మంది అభిమానులు ప్రశ్నించారు.

× RELATED ఇంజిన్ రహిత రైలు ట్రైయిల్ రన్ విజయవంతం